సమస్యలతో ప్రజలు సతమతం కాకూడదు
సుల్తానాబాద్,ఏప్రిల్ 30 (జనం గొంతు) : సమస్యలతో ప్రజలు సతమతం కాకూడదు అని 9వ వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది వార్డు లో ప్రజలు సమస్యలతో సతమతం కాకూడదని మీతో మేము అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆదివారం నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటల సమయంలో ప్రతి ఇంటి ఇంటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, గొట్టం మహేష్, స్వప్న ,అంజయ్య, అమృత, ఆశ వర్కర్లు, సిఏలు, అంగన్వాడి కార్యకర్తలు ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.