బిజెపి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్
సుల్తానాబాద్,మే 2 ( జనం గొంతు) : అకాల వర్షాలతో తడిసి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సుగ్లాంపల్లి ఐకెపి సెంటర్ వద్ద పోసిన ధాన్యాన్ని పరిశీలించారు తడిసిన ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులు తెలపడంతో రాస్తారోకో కు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంట అకాల వర్షాల ద్వారా కొంత నేలపాలుగా మరికొంత కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి రంగు మారిపోయిందని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలని అలాగే రైస్ మిల్లర్లు వివిధ షరతులతో కొనుగోలు చేపట్టడం లేదని ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో ద్వారా ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్,తంగేడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు,కూకట్ల నాగరాజు,రాజేంద్రప్రసాద్, పవన్, మల్లికార్జున్, బెజ్జంకి దిలీప్, ఎర్రోళ్ళ శ్రీకాంత్, ఉప్పు కిరణ్, సిల్వేరి మధు, ఉషణ అన్వేష్, రైతులు గట్టయ్య కొమురయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, కొమరమ్మ, మంగమ్మ పలువురు పాల్గొన్నారు.