• బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష
సుల్తానాబాద్,మే 2 (జనం గొంతు) : ఎంతో శ్రమించి పండించిన పంట నష్టపోయి రైతన్నలు వ్యవసాయ మార్కెట్లలో గోసలు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని బిఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష అన్నారు. మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో మార్కెట్ యార్డులో పోసిన వడ్లును నెల రోజుల కింద అమ్మకానికి తీసుకువస్తే కొనలేని దీనమైన స్థితిలో ఈ ప్రభుత్వము ఉండడం సిగ్గుచేటు అని మార్కెట్ యార్డ్ లో పోసిన వడ్లన్నీ మొలకెత్తి మళ్లీ నాటు వేసే విధంగా తయారయ్యాయని, కనీసం మార్కెట్ యార్డ్ ని సందర్శించడానికి అధికారులు కూడా రాలేని దీనమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, మార్కెట్ యార్డులో తూకం వేసిన వడ్లను రైస్ మిల్లర్లు తీసుకోకపోవడం చాలా బాధాకరమని, రైతే రాజన్న రాష్ట్రంలో రైతుల గోసా వినే నాధుడు లేడని,రైతులకు అండగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పేద ప్రజలు రైతుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా రైతుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి మార్చుకొని వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్చార్జి మొలుమురి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, అసెంబ్లీ మహిళా కన్వీనర్ కల్వల శోభ, పట్టణ అధ్యక్షులు తోట మధు పటేల్, సుల్తానాబాద్ మండల కార్యదర్శి రమేష్, సుల్తానాబాద్ మండల కోశాధికారి అల్లెపు చంద్రశేఖర్, బీవీఫ్ జిల్లా కన్వీనర్ మచ్చ రాహుల్, సీనియర్ నాయకులు తాండ్ర అంజయ్య,బొంకూరి సాగర్, బివిఎఫ్ టీం సభ్యులు సాగర్, ప్రదీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.