కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన మలేరియా అధికారి


సుల్తానాబాద్,మే 4 (జనం గొంతు) : మండలంలోని కాట్నాపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని గురువారం జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాజేశం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి వెలుగు వైద్య శిబిరానికి స్పందన లభిస్తుందని ప్రజల వినియోగించుకోవడం బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, సర్పంచ్ మోహన్ రెడ్డి,డాక్టర్ ఫరహా, పీహెచ్ఎన్ సౌందర్య, ఏఎన్ఎం  కవిత, భారతి, ఆప్తలిక్ సాజియా, డి ఈ ఓ మమత,ఆశ వర్కర్స్ స్వప్న, విజయ ,లావణ్య, కవిత అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు