తెలంగాణ ప్రాంత ఉద్యమ జ్ఞాపకాలు _______________


తెలంగాణ ప్రాంతం లో

కొన్ని సంవత్సరాలుగా

ఉద్యమాలు నడుస్తున్నాయి . ఉద్యమాల గడ్డగా తెలంగాణ ప్రాంతం ప్రపంచ స్థాయిలోనే పేరు ప్రతిష్టలు పొందినది .  ప్రభుత్వపరంగా . పరిపాలన  పరంగా

ప్రజలకు రావలసిన హక్కులు . చట్టాలు.

కేవలం అడిగితే వచ్చినవి కావూ.

పోరాటాలు చేసి సాధించుకున్నవి.

కాకతీయుల కాలం

______________

గత  8  వందల సంవత్సరాల క్రితం

తెలంగాణ ప్రాంతంలో

కాకతీయుల కాలంలో

చేసిన ఉద్యమాలు

పోరాట స్ఫూర్తి నేటికీ నాటి ఉద్యమ జ్ఞాపకాలు ఈ ప్రాంతంలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.

శత్రువులను ఎలా ఎదుర్కోవాలి. యుద్ధంలో ఎలా గెలవాలి. విజయపథం వైపు ఎలా ప్రయత్నాలు కొనసాగించాలి. యుద్ధ 

క్షేత్రంలో  సైనికులు

ప్రదర్శించిన శక్తి యుక్తులు నేడు 

ఉద్యమ పాఠాలు బోధించే విధానం అమల్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

భారత స్వాతంత్ర ఉద్యమం

______________

భారతదేశానికి 15 ఆగస్టు 1947 రోజున

స్వాతంత్రం లభించింది. 200 సంవత్సరాల పాటు

బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చి పెత్తనం చెలాయించి . మన ప్రాంతాన్ని మనకు తిరిగి ఇచ్చి వెళ్లిన రోజుగా మన దేశం

స్వాతంత్ర దినోత్సవం గా సంబరాలు చేసుకుంటున్న రోజులలో  తెలంగాణ ప్రాంతం  హైదరాబాద్

నైజాం నవాబు పరిపాలనలోనే ఉండి

స్వాతంత్ర ఉద్యమాల కు సంబంధించిన సంతోషంలో లేక తెలంగాణ ప్రాంతం

నైజాం విమోచన కోసం 

15 ఆగస్టు 1947 నుండి

17 సెప్టెంబర్ 1948 మధ్యకాలంలో అనేక పోరాటాలు చేసి ఈ  ప్రాంతం 17 సెప్టెంబర్ 1948 రోజున తెలంగాణ విమోచన విముక్తి లభించింది.

సెప్టెంబర్ 17 రోజున ఈ ప్రాంతం తెలంగాణ విమోచన దినోత్సవం గా నాటి నుండి నేటి వరకు  సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. 

1969 తెలంగాణ తొలి దశ  ఉద్యమం

________________

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నిధులు నీళ్లు నియామకాలు నాటి పాలకుల చేత వివక్షతకు గురి అయ్యి

1969 నుండి 1971 మధ్యకాలంలో అనేక ఉద్యమాలు జరిగాయి   .

నాటి విద్యార్థులు  .

యువకులు . చెరుకుగా పాల్గొని

విద్యార్థులు విద్యాసంవత్సరాలను కూడా కోల్పోవడం జరిగింది. 369 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు జరిగాయి     .

2001 తెలంగాణ మలిదశ ఉద్యమం

_______________

తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 నుండి 2014 వరకు జరిగింది.

1969 లో ఉద్యమాలు చేసిన నాటి యువకులు . విద్యార్థులు. 2001 మలిదశ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొని తన అనుభవాలు   . జ్ఞాపకాలను. మలిదశ ఉద్యమంలో  మాస్టారు లాగా  బోధిస్తూ. దిక్సూచిగా  దశా దిశా నిర్దేశం చేస్తూ సలహాలు సూచనలు ఇస్తూ  ఉద్యమాలు నడిపినారు  .

తెలంగాణ ఉద్యమకారులు

______________

ఉద్యమమే ఊపిరిగా.

పోరాటాలనే పూర్తిగా తీసుకొని   . ఉద్యమం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలను వదులుకొని  ప్రతిరోజు ప్రతిక్షణం జై తెలంగాణ నినాదాలతో  పిడికిలి బిగించి  తెలంగాణ నినాదాలను నలు దిక్కులకు  చాటి చెప్పి

నలుగురిని పోగుచేసి

నడిపిన ఉద్యమం.

పాలు తాగే పసిపిల్లల నుండి పండు ముసలి వరకు  ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించడం జరిగింది.

ధర్నాలు. రాస్తా రోకో లు. సభలు . సమావేశాలు. ఊరేగింపులు. పాదయాత్రలు. ప్రదర్శనలు. ధూంధాములు. కోలాటాలు. బతుకమ్మలు. బోనాలు. కుల వృత్తుల ప్రదర్శనలు. రిలే నిరాహార దీక్షలు. విద్యార్థుల చైతన్య సదస్సులు. కవుల కవితలు   . రచయితల రచనలు. గాయకుల గొంతులు.  రైలు రోకో కేసులు. సకల జనుల సమ్మె. ఆటపాటలు.

జాయింట్ యాక్షన్ కమిటీ లు. వివిధ రూపాలలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు రథసారధు లుగా 

తెలంగాణ ఉద్యమాన్ని

నడిపించారు.

ఉద్యమ కేసులు

_____________

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాలలో ఉద్యమకారులపై నాటి ప్రభుత్వాలు పెట్టిన కేసులు స్థానిక పోలీస్ స్టేషన్ లలో మరియు

రైల్వే పోలీస్ స్టేషన్లలో

రైలు రోకో తెలంగాణ ఉద్యమ కేసులు  గత సంవత్సర కాలం క్రితం

వరకు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమకేసులతో తిరిగి తిరిగి విసిగి విసిగి వేసారి పోయారు.  నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ లో

గత సంవత్సర లో

రైల్వే ఉద్యమ కేసులను కొట్టివేయడం జరిగింది. 

తెలంగాణ ఉద్యమ పార్టీ

________________

తెలంగాణ రాష్ట్ర సాధనే  ఏకైక లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమ పార్టీ

2014 నుండి నేటి వరకు పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. నాటి తెలంగాణ ఉద్యమకారులు. నేటి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు   తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన విధంగ  తెలంగాణ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇవ్వాలి    .

అంబేద్కర్ స్ఫూర్తితో

_______________

భారత రాజ్యాంగ నిర్మాత. భారతరత్న. చిన్న రాష్ట్రాల ప్రదాత.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో

ఆర్టికల్ 3 లో చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరించడం జరిగింది. 

అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు నిధులు నీళ్లు నియామకాలలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురి అయ్యి

అభివృద్ధికి నోచుకోక పోవడంతో  తెలంగాణ ప్రజలు ఐక్య ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని

సాధించుకోవడం జరిగింది.  

హైదరాబాద్ లో

____________

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి  132

వ జన్మదినోత్సవాన్ని

పురస్కరించుకొని 

హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ అతి సమీపంలో

125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ విగ్రహాన్ని  14 ఏప్రిల్

2023 రోజున

 ఆవిష్కరించడం జరిగింది .

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు పెట్టడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.

_______________

2  జూన్  2014 రోజున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.

2 జూన్ 2023 నాటికి

10 వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాలను జరపడం కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ శుభ సందర్భంగా  తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి   గౌరవించాలి.

సన్మానించాలి.

నాటి ఉద్యమ జ్ఞాపకాలను  జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి.

ఇట్లు

డాక్టర్. ఈదునూరి.

వెంకటేశ్వర్లు.

MA.Bed. PhD.

తెలంగాణ ఉద్యమకారులు .

రాష్ట్ర ఉపాధ్యక్షులు.

తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్.

9966336457

కామెంట్‌లు