కనుమరుగవుతున్న రాయికల్ చరిత్ర




రాయికల్//జనం గొంతు //ప్రవీణ్. జి


రాయికల్ కు చారిత్రక ప్రాచీన నేపథ్యం ఉన్న పట్టణంగా పేరు ఉంది.దానికి చిహ్నంగా శ్రీ చెన్నకేశవ నాథ ఆలయం అనేక సంవత్సరాలు నుండి ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనాలు విగ్రహాలు కట్టడానికి వినియోగించిన శిల్పాలను, రాళ్ళను గతంలో చరిత్రను సమాధి చేస్తూ అదే గుడికోట ప్రాంగణంలో పూడ్చి వేశారు.

మరోసారి అదే తప్పు చేస్తూ నూతనంగా నిర్మాణం చేస్తున్న షెడ్డు తవ్వకాలలో బయట పడ్డా గుడి కోట రాతి విగ్రహాలను రాతి శిల్పాలను బండలను,అదే విధంగా మరల పూడ్చి పెడుతూ గొప్ప చారిత్రక ప్రాచీన కాలం నాగరికతను సమాధి చేస్తున్నారు, దేవదాయ శాఖ వైపల్యంతో పాటు దీనిపై సంబంధిత ఇంజనీర్ అధికారి పరివెక్షణా వైఫల్యం, కొందరు గుత్తే దారుల విమర్శలకు దారితీస్తుంది.

చరిత్రక ఆధారాలను సమాధి చేస్తున్న వారిపై పురావస్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ లు ఎలాంటి చర్యలు తీసుకోక ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు పట్ల రాయికల్ పట్టణ వాసులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చరిత్రను కాపాడాలని ప్రభుత్వనికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కామెంట్‌లు