హైదరాబాద్ యూసఫ్ గుడాలో L-20 సింపోజియం హర్యానా గవర్నర్ ప్రారంభం.*


గౌరవ భారత ప్రధానమంత్రి యొక్క అధ్యక్షతన G20ని ప్రభుత్వం  1.12.2022 నుండి నిర్వహిస్తున్న విషయం తెలిసినదే.  కింద

దానిలో భాగంగానే



ఈ L20  

భారతదేశంలో అతిపెద్ద గుర్తింపు పొందిన సెంట్రల్ ట్రేడ్ యూనియన్ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్వహిస్తున్న సైడ్ ఈవెంట్‌లలో ఈ L20 

హైదరాబాద్‌లోని  NIMSME, యూసుఫ్‌గూడలో  04.06.2023న ఉదయం 11.00 గంటలకు గౌరవ బండారు దత్తాత్రేయ గారు, హర్యానా గవర్నర్ ప్రారంభించారు.

అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత పరిది, అవకాశాలు, సవాళ్లు మరియు ముందుకు వెళ్ళే మార్గం". అనే అంశం పై సింపోజియం లో

జరిగిన చర్చ లో   అనేక మంది ప్రముఖలు,  ప్యానెలిస్ట్‌లు లేబర్, మేనేజ్‌మెంట్ మరియు కార్మిక రంగాల నుండి అడిషనల్ లేబర్ కమీషనర్ - తెలంగాణ డా:గంగాధర్, ESI డిప్యూటీ డైరెక్టర్ సంజయ్ జాదవ్, జె.శ్రీనివాస్ అసిస్టెంట్ PF కమిషనర్, దేవేందర్ రెడ్డి చైర్మన్ తెలంగాణ సోషల్ సెక్యూరిటీ బోర్డ్, శ్రీమతి రూప చక్రవర్తి నేషనల్ ప్లాట్ ఫాం ఫర్ డొమెస్టిక్ వర్కర్స్, భీమ్ రెడ్డి ఏమిగ్రెట్ వెల్ఫేర్ ఫోరం హైదరాబాద్,  తదితర  ప్రతినిధులు పాల్గొన్నారు. 


జాతీయ సింపోజియంను(చర్చ)  గౌరవనీయులైన శ్రీ బండారు దత్తాత్రేయ గారు, హర్యానా గవర్నర్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.


శ్రీ దత్తాత్రేయ గారు మాట్లాడుతూ

విశేషంగా భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) లేబర్ 20లో భారతీయ భాగస్వామ్యానికి అధ్యక్షత వహించటం సంతోష మన్నారు. ఇది జాతీయ మరియు అంతర్జాతీయ ఫోరమ్‌లలో దేశానికి ,దేశంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు దోహద పడుతుందని అన్నారు. దేశంలో అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత అవసరమని భావించి ESI స్కీం అమలు కు తాను కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడు కృషి చేశానని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి సంఘటిత రంగ కార్మికులకు ఉన్న చట్టాలు అసంఘటిత రంగ కార్మికులకు లేవని అందుకే భారత పార్లమెంట్ 2008 లో అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, చట్టాల అమలు సామాజిక భద్రత బిల్లు ఆమోదించింది అది ఈ దేశ GDP లో 75 శాతం భాగస్వామ్యం వహిస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు సంపూర్ణ సంక్షేమ ఫలాలు అందిస్తుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ నుంచి విచ్చేసిన భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ సంఘటన కార్యదర్శి శ్రీ బి. సురేంద్రన్ 

BMS భారతదేశంలోని అన్ని ఇతర సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌లను కలుపుకుని, జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సుల్లో భాగస్వామ్యం వహిస్తూ  భారత అధ్యక్షతన L20ని సాధ్యమైనంత స్వతంత్య్రం గా నిర్వహిస్తున్నదని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మిక సమస్యలపై విధానపరమైన సిఫార్సులను విశ్లేషించి ఆమోదించడం మరియు అమలు  చేయడం L20 యొక్క లక్ష్యం అన్నారు.


G-20 దేశాలలో  సాధారణంగా ఉన్న కార్మిక సమస్యలపై చర్చించడం.

ఎంచుకున్న సమస్యలపై ఏకాభిప్రాయాన్ని సాధించడం మరియు ప్రకటన చేయడం.

వివిధ దేశాల యూనియన్లతో ద్వైపాక్షిక / బహుపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా అసంఘటిత రంగ కార్మికులు అత్యధికంగా ఉన్న హైదరాబాద్ లో

 L20 సింపోజియం జరగడం సంతోషమన్నారు.


  సింపోజియం లో పాల్గొన్న వివిధ లేబర్ , ESI,PF కమిషనర్లు BMS, TTUC,HMS,HMKP తో సహ వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ క్రింది విషయాలపై  L20 సింపోజియం లో  చర్చించారు అంశాలు యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ మరియు పని యొక్క భవిష్యత్తు, గ్లోబల్ స్కిల్ గ్యాప్స్, గిగ్ మరియు ప్లాట్‌ఫాం ఎకానమీ, సస్టైనబుల్ ఫైనాన్సింగ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. అలాగే

L20 పేర్కొన్న 

(I) యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ &

II) మహిళలు & పని భవిష్యత్తు పై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ నెల 22,23 తేదీలలో  పాట్నా లో జరిగే సమ్మిట్ L20 యొక్క గ్రాండ్ సమ్మిట్ జరగనుందని ఇక్కడ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు మరియు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కార్మిక నిపుణులు  భారతదేశంలలో మరియు కార్మికులకు సంబంధించిన ప్రపంచ సమస్యలపై చర్చించాలని భావిస్తున్నారని ఈ సమ్మిట్ కార్మికుల ప్రాధాన్యతా అంశాలపై  తుది ప్రకటనను చర్చిస్తుందని EPF ట్రస్టీ జాతీయ ఉపాధ్యక్షులు యస్ మల్లేశం తెలియ చేసారు. 

      హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ సింపోజియం అసంఘటిత కార్మికుల జీవితాలను మెరుగుపరిచే మార్గాలు తగిన సామాజిక భద్రత కల్పించడం కొరకు దోహద పడుతుందని తెలంగాణ అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు సభ్యులు, న్యాయవాది BMS రాష్ట్ర అధ్యక్షులు బి.రవీంద్ర రాజు వర్మ తెలియ చేశారు.


ఈరోజు జరిగిన సింపోజియం కార్యక్రమం లో  ఈ కింది BMS నాయకులు పాల్గొన్నారు 


యస్.మల్లేశం

ఈపీఎఫ్ ట్రస్టీ

BMS KKS సభ్యులు

వి సుబ్రమణ్యం

ఎ.రవిశంకర్

కెవి రాధాకృష్ణ

రాష్ట్ర అధ్యక్షులు

బి.రవీంద్ర రాజు వర్మ

ప్రధాన కార్యదర్శి

తూర్పు రాం రెడ్డి

రెబ్బ రామరావు HMS, దామోదర్ రెడ్డి HMKP , MK బోస్ TNTUC, డా:నమిత L-20 సెక్రటేరియట్

BMS రాష్ట్ర

కార్యదర్శి లు

జె.రాం మోహన్

పి.లక్ష్మి నారాయణ

రమేష్ 

తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు