వీలైతే చరిత్రను రక్షించుకుందాం... కాని చరిత్ర హీనులుగా మాత్రం మిగలవద్దు.


రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్.జి


మన రావికంటి చరిత్ర


రావికంటిలో 'మిట్టన గుళ్ళు వంపున చెరువు' నిర్మించిన స్వాభిమాని జైనరాణి లకుమాదేవి!


జగిత్యాల్ జిల్లా కేంద్రానికి అటు కోరుట్ల పట్టణానికి కేవలం 15-20 కి మీ దూరంలోనున్నా ఒకప్పుడు రాయికల్ ను

మారుమూల గ్రామం అనేవారు. నాటి కాలంలో రావికంటి,ప్రభాకరరావు పేట,గోవిందరాజు పేట, బద్దులాపురం( పద్మాపురం ), నందిపేట, నాగారం, కొండాపురం అను ఏడు గ్రామాలు కలిసి ఏర్పడడం వల్ల గ్రామీణులు

దీన్ని ఇప్పటికీ 'రావికంటి' అనే పిలుస్తుంటారు.


వేములవాడ చాళుక్యుల/ కాకతీయుల కాలంనాటి గుడి, ఒకప్పుడు దాని చుట్టూవున్న కోటను బట్టి 'గుడికోట' గా ప్రసిద్ధమైన ప్రస్తుతం

'శ్రీ కేశవనాథస్వామి ఆలయం'గా పిలువబడుతున్న ఇక్కడి  త్రికూటాలయం రాయికల్ కు మాకుటాయామనం లాంటిది.


కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు ( 1296-1325) రాజ్యం చేస్తున్న కాలంలో వారి సామంతుడు రుద్రదేవుడు,వారి సేవకుడు

బెజగంగూలెంక శకవర్షం 1227 శ్రావణ బహుళ ద్వాదశి వడ్డవారం (క్రీశ1305 ఆగస్టు17మంగళవారం) నాటి దాన శాసనం ప్రకారం ఇది ఆనాడు రామనాథ లఖుమేశ్వర ( లక్ష్మణేశ్వర)ఆలయం.


అయితే వేములవాడ రాజధానిగా కరీంనగర్ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యుల కాలంలో ఇది 'జైనాలయం'గా వుండేదని 

ఈ ఆలయ పరిసరాల త్రవ్వకాల్లో లభించిన జైన తీర్థంకరుని శిరస్సును బట్టి అర్థమౌతుంది.


అంతే కాదు ఇక్కడి స్థల చరిత్రలో ఆలయ నిర్మాత గా చెప్పబడే,

వైశ్య వనితగా భావించబడే

 'లకుమాదేవి 'జైన మతస్తురాలు కావడం విశేషం.


ఈ రాణి స్వాభిమానం మహిళా లోకానికే గర్వ కారణం.


లకుమాదేవి తన బిడ్డకు పాలిస్తున్న సమయంలో ఆమె మామగారు లోపలికి రావడం , అది ఆమె గమనించక పోవడం జరిగిందట.

కోడలు తనను చూసి కూడా లేచి నిలబడలేదని, కుర్చీ పీట వేయలేదని ఆగ్రహించిన

ఆ పెద్దాయన ' వంపున చెరువు - మిట్టన గుళ్ళు కట్టించిన రాణిలా మిడిసిపడుతున్నావని' అన్నాడట.


ఆత్మభిమానం గల లకుమ బాధ పడుతూనే 'గర్వంతో కాదు మీ

రాక గమనించకనే, అయితే మీ వాక్కుల్లో నాకు భవిష్యత్ వాణి వినబడుతుంది, మీరన్న పనులు నేను చేసి చూపుతా'నని ప్రతిన బూని తన తల్లిగారు పెట్టిన ఏడు వారాల నగలను కూడా అమ్మి 'మిట్టన ఈ గుళ్ళు - వంపున  చెరువు' నిర్మించిందని చెబుతారు.


చెరువు నిర్మాణం పూర్తి అయినా వర్షాభావం వల్ల అది నిండకపోవడాన్ని కొందరు పండితులు తన దోషంగా చెబుతూ చెరువు  నరబలి కోరుతుందనడంతో స్వయంగా తానే ఒక అర్ధరాత్రి లేచి సర్వాలంకార భూషితయయి వెళ్లి చెరువులో ఒక గుండు దగ్గర ఊరి కోసం ప్రాణత్యాగం చేసిందన్నది బహుళ

ప్రచారంలోనున్న కథ.


ఈ మహాసాధ్వి పేరుతో ఇప్పటికీ అది 'లకుమాదేవి గుండు 'గానే పిలువబడుతుంది.


కాకతీయుల కాలం నాటి 'బెజగంగూలెంక దాన శాసనాన్ని' లెక్కలోకి తీసుకున్నా రాయికల్  దాదాపు ఏడున్నర శతాబ్దాల నాటి చారిత్రక గ్రామం.


'మాధవ చరిత్ర(అముద్రితం) 'కర్త తిరునగరి నర్సింహదాసు,

రామశతక కర్త వరకవి భూమగౌడు (వీరి జీవిత ఆధారంగా నేను రచించిన నవల ఇదే పేరుతో 2017 లో వెలువడింది.


కీ శే వేముల పెరుమాళ్ళు గారు రాయికల్ మండల మొదటి అధ్యక్షులు(1987-1993)కావడమే కాకుండా 'శ్రీ కేశవనాథ స్వామి ఆలయ' చరిత్రను వెలికితీసి

దీని అభివృద్ధికి విశేషంగా

కృషి చేసినారు.


కానీ ఇప్పుడు అభివృద్ధి పేరుతో కొంతమంది స్వలాభం కోసం  చరిత్రను కించపరుస్తూ  చరిత్ర హీనులగా గుర్తుండిపోతారు.


మీ జనం గొంతు....✍️

కామెంట్‌లు